కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్‌

భూపాలపల్లి అర్బన్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమరయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీను, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భువనసుందర్‌, వెంకీయాదవ్‌, దేవన్‌, లక్ష్మి, పరమేశ్వరి, అజ్మీర జంపన్న, రమేష్‌, హఫీజ్‌, రాధా, ప్రేమ్‌కుమార్‌, నాగరాజు, కిషోర్‌, భిక్షపతి, పొనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement