‘లా’ ఫలితాలు వెల్లడి.. | - | Sakshi
Sakshi News home page

‘లా’ ఫలితాలు వెల్లడి..

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

‘లా’ ఫలితాలు వెల్లడి.. రామప్పలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

ఆలిండియా బార్‌ కౌన్సిల్‌ ఎగ్జామ్‌ దరఖాస్తుకు సుగమం

నేటితో అఖరు కావడంతో అప్లయ్‌ చేసుకునేందుకు చాన్స్‌

‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు

సాక్షి, వరంగల్‌ : కాకతీయ యూనివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్‌ కౌన్సిల్‌ ఎగ్జామ్‌’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్‌’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్‌లాగ్స్‌ లేని మూడేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమిస్టర్‌ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్‌ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్‌గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్‌.ఆర్గ్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘ఆలిండియా బార్‌ కౌన్సిల్‌ ఎగ్జామ్‌’కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది.

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భాస్కర్‌ వారిని శాలువాతో సత్కరించారు. టూరిజం గైడ్‌ విజయ్‌కుమార్‌ ఆలయ విశిష్టత గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement