తడిసిన ధాన్యాన్ని మ్యాశ్చర్ లేకుండా కొనుగోలు చేయాలి. మూడెకరాలకు సంబంధించిన ధాన్యం రాత్రి కురిసిన వానకు తడిసింది. ఇది ఆరాలంటే చాలా సమయం పడుతుంది. అధికారులు మాశ్చర్ లేకుంగా ధాన్యాన్ని కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకుంటే రైతులకు ఉపయోగంగా ఉంటుంది.
– లలిత రైతు, కమలాపూర్
60 టన్నుల వరకు తడిసిందని అంచనా
అకాల వర్షానికి సుమారుగా 60 టన్నుల ధాన్యం తడిసినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశాం. రైతులు అధైర్య పడకుండా తడిసిన ధాన్యాన్ని ఆరబెడిలే కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లు కూడా వేగవంతం చేస్తున్నాం. అన్ని చర్యలు చేపడుతున్నాం.
– రాములు, జిల్లా మార్కెటింగ్ అధికారి


