చిట్యాల: రైతుల పండించిన ధాన్యాన్ని మిల్లు యజమానులు గోదాములలో నిల్వ చేసుకునేందుకు సహకరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. శనివారం మండలకేంద్రంలోని బాలమురగన్ కాటన్ మిల్లు వద్ద ట్రాక్టర్‌లలో మొక్కజొన్న ధ్యాన్యంతో వేచి ఉన్న రైతులను గమనించి వారి వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిల్లును సందర్శించి యజమానితో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లులో నిల్వలు చేసుకోవాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మండల నాయకులు, రైతులు ఉన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


