‘షైన్‌’ విజయకేతనం.. | - | Sakshi
Sakshi News home page

‘షైన్‌’ విజయకేతనం..

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్‌ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్‌.రేవంత్‌, ఎండి అఫ్రోజ్‌ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్‌ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్‌, సీహెచ్‌.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్‌ 582, ఎ.హరిణి 581, పి.యతిస్‌, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్‌ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్‌ యాదవ్‌ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్‌, నీట్‌తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్‌ మూగల రమ, షైన్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్‌ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్‌ యాదవ్‌, ఐఐటీ కోఆర్డినేటర్‌ మూగల రమేశ్‌ యాదవ్‌, ప్రిన్సిపాళ్లు పి.విశాల్‌, కె.దినేశ్‌, రాజ్‌ కుమార్‌, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్‌, పి.శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement