సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు

May 8 2026 12:19 PM | Updated on May 8 2026 12:19 PM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడుతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ అన్నారు. గురువారం ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్‌ మాట్లాడారు. జిల్లా పరిధిలోని మారుమూల గ్రామాల నుంచి పేద ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వస్తున్నప్పటికీ, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు రోజులుగా బాత్రూమ్‌లకు నీటి సరఫరా లేకపోవడం, తాగునీటి కొరత తీవ్రంగా ఉండడం, డాక్టర్లు సమయానికి రాకపోవడం వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులలో సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్‌, మడే సంతోష్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement