వినోదాల పరేషాన్‌ | Sakshi
Sakshi News home page

వినోదాల పరేషాన్‌

Published Sat, May 6 2023 4:45 AM

Pareshan Movie Updates - Sakshi

‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్‌’. రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించారు. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాని జూన్‌ 2న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ‘‘తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రం ‘పరేషాన్‌’. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.

ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు.పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండమ్, సంగీతం: యశ్వంత్‌ నాగ్, లైన్‌ ప్రొడ్యూసర్‌: ప్రవీణ్‌ విన్సెంట్, అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌: విశ్వదేవ్‌ రాచకొండ, హేమ రాళ్లపల్లి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement