తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా భరత్ దర్శన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. తొలి సినిమా ‘శివమ్ భజే’తో ప్రేక్షకులని అలరించిన గంగా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ఇది.
‘‘హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ఒకేసారి రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు.


