ప్రతి సినిమాకు అదే అసలైన బలం : విశ్వక్‌ సేన్‌ | Sakshi
Sakshi News home page

‘రామన్న యూత్‌’ చిత్రానికి అలాంటి మ్యాజిక్‌ జరగాలి: విశ్వక్‌ సేన్‌

Published Wed, Sep 13 2023 12:44 AM

Mas Ka Das Vishwak Sen was the guest of honor at the pre release event of Ramanna Youth - Sakshi

‘చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్‌ ఇంత ఉండాలనే అవసరం లేదని ‘పెళ్ళి చూపులు, అర్జున్‌ రెడ్డి, బలగం, మసూద, ఫలక్‌నుమా దాస్‌’ వంటి ఎన్నో చిత్రాలు నిరూపించాయి. సినిమాకు ఎంత బడ్జెట్‌ పెట్టామనేది చూస్తుంటారు చాలామంది. కానీ ఆ చిత్రంలో పనిచేస్తున్న వాళ్లు ఎంత ప్రతిభావంతులు అనేది చూస్తే అదే సినిమాకు అసలైన బలం. ‘రామన్న యూత్‌’ చిత్రానికి అలాంటి మ్యాజిక్‌ జరగాలి.ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు.

అభయ్‌ నవీన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్‌’. అమూల్య రెడ్డి హీరోయిన్‌గా చేశారు. ఫైర్‌ ఫ్లై ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడకకి విశ్వక్‌ సేన్, నటులు ప్రియదర్శి, తిరువీర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో తిర్‌వీర్‌ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాతో కలిసి ఆటోలో తిరిగిన అభయ్ నవీన్ ఇప్పుడు ఇలా సినిమా చేశాడని అంటే ఆనందంగా ఉంది. డబ్ స్మాష్ ద్వారా చాలా వీడియోలు చేసేవాడు. కలిసి సినిమాలో నటించాం. అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అభయ్..ఇప్పుడు డైరెక్టర్ అయి మా ఫ్రెండ్స్ కు అవకాశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. 

‘నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది’ అని హీరో ప్రియదర్శి  అన్నారు. ‘‘ప్రేక్షకులకు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనేది తెలియదు. మంచి కథ ఉంటే ఆ చిత్రాన్ని తప్పకుండా చూస్తారు. ‘రామన్న యూత్‌’ని థియేటర్‌ లో చూసి ప్రోత్సహించాలి’’ అన్నారు అభయ్‌ నవీన్‌. 

 
Advertisement
 
Advertisement