పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో వస్తున్న 'మసూదా' హీరో

‘మసూద’ వంటి హిట్ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రం ద్వారా జీజీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏషియన్ ఫిల్మ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై వ్యాపారవేత్త రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు.
‘‘పీరియడ్ యాక్షన్ డ్రామా జానర్ చిత్రమిది. గతంలో ఎప్పుడూ చూడని విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. టైటిల్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు రవి కుమార్ పనస.