కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ అవసరం లేదు: దిల్‌ రాజు | Sakshi
Sakshi News home page

కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ అవసరం లేదు: దిల్‌ రాజు

Published Tue, Dec 6 2022 5:00 PM

Dil Raju, Rahul Yadav, Thiruveer Speech at Masooda Movie Success Meet - Sakshi

‘మంచి సినిమాలకు సీజన్ అంటూ ఏమి ఉండదు. కంటెంట్‌ ఉన్న సినిమాను ఎప్పుడు విడుదల చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మసూద’ మరోసారి నిరూపించింది’ అని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది.

ఈ సంద్భంగా తాజాగా చిత్ర యూనిట్‌  థాంక్యూ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దిల్‌ రాజు మాట్లాడుతూ.. ఒక నిర్మాత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు సినిమా తియ్యాలి అనుకుని, మంచి సంకల్పం తో  సినిమాకు ప్రాణం పెట్టి తీస్తే  హిట్ రిజల్ట్ వస్తుందని ఈ జనరేషన్ లో రాహుల్ ప్రూవ్ చేశాడు. తన హోమ్‌ బ్యానర్( స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్) లో వరుసగా మూడు సినిమాలు( మళ్లీ రావా, ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌, మసూద)  హిట్ సాధించిన రాహుల్ కు & టీం కు కంగ్రాట్స్. నవంబర్ 18 న మసూద ఆ తరువాత "లవ్ టుడే", "హిట్ 2" ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించడం చూస్తుంటే ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది’ అన్నారు. 

నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మళ్ళీ రావా, ఏజెంట్ ఆత్రేయ సినిమాలు బిగ్ హిట్ అయిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న టైమ్ లో మసూద లాంటి స్క్రిప్ట్ ఇచ్చిన సాయికి బిగ్ థాంక్స్. ఈ స్క్రిప్ట్ పూర్తిగా చదివిన తరువాత  ఈ కథకు నిర్మాతగా న్యాయం చేయగలుగుతానా లేదా, చివరి వరకు ఈ సినిమాను తీసుకెళ్ల గలిగే ఓపిక ఉందా లేదా అనుకున్నాను. అయితే నాకు సాయి ఫుల్ సపోర్ట్ చేశారు. మసూద కోసం టీమ్‌ అంతా కష్టపడి పని చేశారు. అందుకే ఇలాంటి విజయం వచ్చింది’ అని అన్నారు. 

హీరో సుమంత్ మాట్లాడుతూ.. ‘రాహుల్ తో గత  ఆరేళ్లుగా జర్నీ చేస్తున్నాను. తన బ్యానర్ లో మెదటి సినిమా "మళ్ళీ రావా" చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత మసూదతో  రియలిస్టిక్ హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి  హ్యాట్రిక్ హిట్ సాధించాడు. ఇంత పెద్ద హిట్ సాధించిన మసూద టీం సభ్యులందరికీ  అల్ ద బెస్ట్ ’అన్నారు

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా  మంచి కథను సెలెక్ట్ చేసుకొని సినిమా తియ్యడమే కాకుండా ఎంతో దైర్యంగా సినిమాను  రిలీజ్ చేసి విజయం సాధించిన రాహుల్‌ టీమ్‌కు అభినందనలు. మసూద సినిమా చూసిన  ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ కు గురవుతాడు’అని నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ అన్నారు. ‘నాకు హరర్ సినిమాలు అంటే భయం. కానీ ఈ సినిమాను రాహుల్ తో  కలసి మెదటి రోజు చూశాను చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు అలాంటి సినిమా తియ్యాలని ఉంది’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్‌ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement