అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో | Actor Thiruveer Bought New House | Sakshi
Sakshi News home page

Thiruveer: 20 ఏళ్ల కల.. 'మసూద' హీరో పోస్ట్ వైరల్

Published Sat, Mar 22 2025 2:24 PM | Last Updated on Sat, Mar 22 2025 2:24 PM

Actor Thiruveer Bought New House

తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. రీసెంట్ టైంలో 'మసూద' మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాంటిది తల్లి చివరి కోరిక తీర్చానని చెప్పి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్‌: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్‌..?)

2016 నుంచి నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్న తిరువీర్.. ఇన్నాళ్లకు సొంతూరిలో ఇల్లు కట్టుకున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలు షేర్ చేసుకుని మురిసిపోయాడు. 

పరేషాన్, టక్ జగదీష్, పలాస్ 1978, జార్జ్ రెడ్డి తదితర చిత్రాల్లోనూ తిరువీర్ నటించాడు. సిన్, మెట్రో కథలు, కుమారి శ్రీమతి తదితర వెబ్ సిరీసుల్లోనూ కనిపించాడు. గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సొంతిల్లు కట్టుకుని తల్లి చివరి కోరికని నెరవేర్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement