'పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్'.. ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా టీజర్ | Thiruveer The Great Pre Wedding Show Movie Teaser out now | Sakshi
Sakshi News home page

Pre Wedding Show Movie Teaser: 'ఈ రోజుల్లో ఇదంతా మామూలే'.. ప్రీ వెడ్డింగ్ షూట్‌ టీజర్‌ చూశారా?

Sep 16 2025 9:39 PM | Updated on Sep 16 2025 9:42 PM

Thiruveer The Great Pre Wedding Show Movie Teaser out now

మసూద ఫేమ్ తిరువీర్ నటించిన తాజా చిత్రం ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో(The Great Pre Wedding Show). ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదల చేశారు మేకర్స్.

ఈ సినిమా టీజర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. ఈ చిత్రంలో తిరువీర్‌ ఫోటోగ్రాఫర్‌ పాత్రలో కనిపించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌కు ఫోటోలు, వీడియోలు తీస్తూ నవ్వులు పూయించారు. ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్‌పై ఫన్నీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ చిత్రంలో టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని 70ఎం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో సందీప్ అగరం, అశ్మితా రెడ్డి బసాని నిర్మించారు. ఈ సినిమాకు సురేష్ బొబిల్లి సంగీతమందించారు. ఈ సినిమా నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement