
బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే ఎక్కువమందికి గుర్తొచ్చేది దిశాపటానీ- మౌనీరాయ్. వీళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్.

సంతోషమొచ్చినా, బాధేసినా అన్నీ పంచుకుంటారు. కల్కి హీరోయిన్ దిశా పటానీ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయితే..

మౌనీ రాయ్ బుల్లితెర ఇండస్ట్రీలో పాపులర్.

నేడు (సెప్టెంబర్ 28) మౌనీరాయ్ బర్త్‌డే. కాబట్టి ఈ రోజు తనకెంతో ప్రత్యేకమంటోంది దిశా పటాని.

హ్యాపీ బర్త్‌డే మూ స్టార్ మోంజు.. నా జీవితంలో ఇంత సంతోషాన్ని నింపినందుకు థాంక్యూ.. నువ్వు దొరకడం నా అదృష్టం.

నువ్వు నాకు సొంత సోదరిలాంటిదానివి. లవ్యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.










