సామాన్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి సరిపోరా..? | Janasena Jaggampeta Incharge Patam Setti Suryachandra Gets Emotional After Seats Announcement, Video Inside - Sakshi
Sakshi News home page

Patam Setty Surya Chandra Emotional: సామాన్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి సరిపోరా..?

Published Sun, Feb 25 2024 7:01 PM

Janasena Jaggampeta incharge Patamsetty Surya Chandra Emotional - Sakshi

డబ్బులతో పాలిటిక్స్‌ చేయనంటూ ఉపన్యాసాలిచ్చే జనసేనాని.. రూటు మార్చేశారు.. విలువలను తుంగలో తొక్కేసి డబ్బున్న వారికే టికెట్లు అంటూ తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నారు.. రాజకీయాల్లో రానున్న కాలంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనంటూ ఇటీవల భీమవరంలో నేతలతో జరిగిన సమావేశంలో తన వ్యాఖ్యలు పచ్చి నిజాలేనని నిరూపిస్తూ.. జనసేన జగ్గంపేట ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్రకు పవన్‌ పెద్దషాకే ఇచ్చారు.

తన లాంటి సామాన్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి సరిపోరా అంటూ జనసేన జగ్గంపేట ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన సంయుక్తంగా పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో భాగంగా జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్‌ టీడీపీకి ప్రకటించారు. 2019 నుంచి జనసేనలో తిరుగుతూ నియోజకవర్గంలోని పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు టిక్కెట్టు కేటాయించపోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు.

సామాన్యుడిగా పుట్టి  రబ్బరు చెప్పులు వేసుకనే తాను ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడం తగదేమోనన్నారు. తనలా సామాన్యుడిగా పుట్టి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించే యువతకు తన జీవితం గుణపాఠం కావాలన్నారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదంటూ ఆయన ఆమరణ నిరాహార దీక్కుదిగారు.

 
Advertisement
 
Advertisement