
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి చెందడంతో భావోద్వేగానికి లోనైనా మంత్రి.. కన్నీరుమున్నీరయ్యారు.
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి చెందడంతో భావోద్వేగానికి లోనైనా మంత్రి.. కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో చనిపోయిన హ్యాపీకి మంత్రి కొండా కుటుంబం.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.
గత కొన్నాళ్లుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, స్టాఫ్ పంచుకున్నారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Minister Konda Surekha breaks down in tears over sudden death of pet dog ‘Happy’
pic.twitter.com/f87jhedaPA— Naveena (@TheNaveena) March 6, 2025
