
టీనేజ్ పిల్లల చేష్టలు అమాయకంగా అనిపించినా, ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకున్నది దక్కించుకునేందుకు ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడతారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని, కాన్పూర్‌లోని శాస్త్రి నగర్‌లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే షాక్ అవ్వకతప్పదు 13 ఏళ్ల బాలుడు తన సోదరి నిశ్చితార్థ ఉంగరాన్ని ఎత్తుకుపోయాడు. ఇది దురాశతోనో , డబ్బులతో కాదు.. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ వస్తువుల పట్ల ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదు. ఈనేపథ్యంలో కేవలం మ్యాగీ నూడుల్స్ కోసం తనసోదరి ఎంగేజ్‌మెంట్‌ను రింగ్‌ను అమ్మేయాలని చూశాడు. కానీ దుకాణ యజమాని , ఆ కుర్రోడి తల్లికి ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.విషయం తెలుసుకున్న తల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.
ఉంగరాన్ని కొట్టేసిన బాలుడు ఆభరణాల దుకాణానికి వెళ్లాడు. ఉంగరాన్ని తీసుకొని డబ్బులు ఇమ్మని అడిగాడు. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ బాలుడి అమాయకత్వాన్ని చూసి అనుమానం వచ్చింది. కారణాలను ఆరాతీశాడు. మ్యాగీ కొనడానికి డబ్బుల్లేవని, అందుకే ఉంగరాన్ని తెచ్చానని ఆ బాలుడు అమాయకరంగా సమాధానం ఇచ్చాడు.
చదవండి: ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’
వెంటనే ఆ ఆభరణాల వ్యాపారి వెంటనే ఆ బాలుడి తల్లికి సమాచారమిచ్చాడు. తన కుమార్తె నిశ్చితార్థం ఉంగరం చూసి తల్లి షాక్ అయ్యింది. వివాహం కొన్ని రోజుల్లోనే జరగాల్సి ఉందని, ఈ ఖరీదైన ఉంగరం పోయి ఉంటే చాలా సమస్యలెదుర్కోవాల్సి వచ్చేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజాయతీగా ప్రవర్తించిన నగల వ్యాపారికి తల్లి కళ్ల నిండానీళ్లతో ధన్యవాదాలు తెలిపింది.
చదవండి : కేఎఫ్‌సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!
అయితే సరైన ధృవీకరణ లేకుండా మైనర్లు తెచ్చిన ఆభరణాలను తాము కొనుగోలుచేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆభరణాల వ్యాపారి నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంది.