
మహాతల్లి జాహ్నవి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

డెలివరీకి కొన్ని వారాల ముందు భర్తతో కలిసి ఫోటోషూట్ చేసింది.

అలాగే తన ఫ్రెండ్స్ నిహారిక కొణిదెల, వితికా షెరు, అంబటి భార్గవితో కలిసి కూడా స్పెషల్ షూట్ చేసింది.

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలైంది.

ఈ ముగ్గుర్నీ మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇంత క్లోజ్ అవుతామని తెలీదు.

బాలి ట్రిప్‌తో మా బంధం బలపడింది. ఆ ట్రిప్‌కు వెళ్లకపోయుంటే ఇంత అందమైన స్నేహాన్ని, ప్రేమను మిస్ అయ్యేదాన్ని.

ప్రెగ్నెన్సీలో మంచి రోజుల్ని, చెడ్డ రోజుల్ని రెండింటినీ చూశాను.

ఈ ఫ్రెండ్స్ లేకపోయుంటే నా జర్నీ ఇలా ఉండేదే కాదు.

మీరు స్నేహానికి కొత్త నిర్వచనం చెప్పారు అంటూ భావోద్వేగానికి లోనైంది.





