భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది
‘‘హ్యాపీ బర్త్‌డే అమ్మా.. కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడం నేర్పింది నువ్వే.
నాకు తెలిసిన శక్తిమంతమైన మహిళవు నువ్వే.
ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో రావాలి.
ప్రేమ, సంతోషంతో అవన్నీ నిండిపోవాలి’’ అంటూ ఉద్వేగపూరిత నోట్‌తో పాటు తల్లితో దిగిన ఫొటోను సింధు సోమవారం షేర్ చేసింది.


