
'కాంతా లగా' అనే పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (Shefali Jariwala). 2002లో వచ్చిన ఈ పాటతోనే మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్‌తో యూత్‌కు దగ్గరైంది. కానీ ఊహించని విధంగా ఆమె ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా ఆమె మరణాన్ని తలచుకుని భర్త పరాగ్ త్యాగి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన భార్యతో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు.
పరాగ్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'షెఫాలి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతావు. నువ్వు ఒక నమ్మకమైన స్నేహితురాలు, నా ప్రియమైన భార్య. నువ్వు మా అందరిని అమ్మలా చూసుకున్నావ్. ఎల్లప్పుడూ ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే నువ్వు గొప్ప అంకితభావం గల వక్తి. కేవలం ఆప్యాయతగల భార్య మాత్రమే కాదు.. సింబాకు అద్భుతమైన తల్లివి కూడా. నువ్వు ప్రేమించిన వారి వెంట నిలిచే నమ్మకమైన స్నేహితురాలివి. అందుకే షెఫాలి గుర్తింపునకు అర్హురాలు. ఆమె ప్రజలను అలరించిన విధానం మరిచిపోలేనిది. ఇప్పుడు మనతో లేకపోయినా తన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేం. శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ ఎమోనషల్ అయ్యారు. కాగా.. ఆమె మరణం తర్వాత ఐదు రోజులకు షెఫాలీ జరివాలా జ్ఞాపకార్థం ముంబయిలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు.