ఈ సంక్రాంతి టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.
ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.
నవీన్ పొలిశెట్టి తన ట్వీట్‌లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది. నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్‌బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు
Thinking about all the auditions in Mumbai. Enno saarlu give up cheseyali anipinchindi. Even with this film I used to cry everyday after my accident wondering how I will write and act. Today #AnaganagaOkaRaju has grossed 100 crores worldwide. 🙏🏻🙏🏻🙏🏻
My heart is filled with… pic.twitter.com/2GN9Kxl4FI— Naveen Polishetty (@NaveenPolishety) January 19, 2026


