హీరో మంచు మనోజ్‌ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు! | Manchu Manoj Wife Bhuma Mounika Full emotional At Song launch Event | Sakshi
Sakshi News home page

Manchu Manoj -Mounika: ఆ పాటకు కన్నీళ్లు ఆపులేకపోయిన మౌనిక.. వీడియో వైరల్!

Nov 5 2025 1:24 PM | Updated on Nov 5 2025 3:03 PM

Manchu Manoj Wife Bhuma Mounika Full emotional At Song launch Event

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్‌తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అయితే హీరో మంచు మనోజ్‌ తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్‌ రాంబాయి అనే సినిమా సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.

అయితే ఈవెంట్‌కు హాజరైన మిట్టపల్లి సురేందర్‌ ఓ సాంగ్‌ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్‌, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్‌ ‍అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement