
మోసగించి రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి
రెండో భార్యతో రూ.50 లక్షలు కాజేసి పరారీ
పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు
కర్ణాటక: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నకిలీ దాఖలాలను సృష్టించిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకోగా రెండో భార్య వద్ద నుంచి సుమారు రూ.50 లక్షలకు పైగా నగదు తీసుకొని పరారైన సంఘటన నగరంలోని కువెంపునగర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోసకారి వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని వంచనకు గురైన బాధితురాలు రోజా ఆనే మహిళ కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని కువెంపు నగరలో లేడీస్ పీజీని నిర్వహిస్తున్న రోజా ఆనే మహిళ మొదటి భర్త నుంచి కొన్ని కారణాలతో విడాకులు తీసుకుంది.
ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడికి అండగా ఉండటం కోసం రెండో పెళ్లి చేసుకోడానికి డైవర్స్ మ్యాట్రిమోనిలో యాప్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళకు చెందిన త్రిశూర్‌లో నివాసం ఉంటున్న శరత్ రామ్ రోజాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి అయిందని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చానని నకిలీ దాఖలాలు రోజాకు చూపించాడు. దాంతో శరత్‌రామ్‌ను నమ్మిన రోజా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
పెళ్లికి ముందే షికార్లు
ఇద్దరు కలిసి పెళ్లికి ముందు షికార్లు తిరిగారు. శారీరకంగాను కలిశారు. పెళ్లి ఘనంగా వద్దని రిజిస్టర్ పెళ్లి చెసుకుందామని ఆనుకున్నారు. ఈ సందర్బంగా తనకు వ్యాపారం కోసం అని విడతల వారీగా రోజా వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నగదును తీసుకున్నాడు. అనంతరం లేడీడిస్ పీజీలో వచ్చిన డబ్బు కూడా తీసుకున్నాడు. రోజా పేరుతో రెండు కంపెనీలు పెట్టి ఆందులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి వారిని కూడా మోసం చేశారు.
పెళ్లి చేసుకుందామని కోరుతున్నా వాయిదా వేస్తూ వచాచడు. దాంతొ ఆనుమానం పెంచుకున్న రోజా ఆతని విడాకులు నిజమా, కాదా? అని న్యాయవాది ద్వారా విచారిందగా అవి నకిలీ అని, అతను విడాకులు తీసుకోలేదని మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని రోజా ప్రశ్నించడంతో తననే ఎదిరిస్తావా? ఆని రోజా పైన దాడి చేసి కొట్టి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.