
తమిళ హీరో జయం రవి విడాకుల పంచాయతీ రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇతడు గతేడాది తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత అంతా సైలెంట్. కానీ రీసెంట్ గా ఓ నిర్మాత కూతురి పెళ్లిలో సింగర్ కెనీషాతో ఈ హీరో కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి.
(ఇదీ చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్)
జయం రవి.. మరో అమ్మాయితో కనిపించేసరికి మాజీ భార్య ఆర్తికి ఎక్కడో మండింది. దీంతో తన భర్తకు అసలు బాధ్యత లేదని, పిల్లల్ని పట్టించుకోవట్లేదని పెద్ద పోస్ట్ పెట్టింది. దీని తర్వాత కెనీషా కూడా పరోక్షంగా ఆర్తిని కౌంటర్ చేస్తూ పోస్టులు పెట్టింది. ఇదే విషయమై స్పందించిన జయం రవి.. కెనీషా, ఆర్తి గురించి క్లారిటీ ఇచ్చేశాడు.
ఇప్పుడు ఈ విడాకుల పంచాయతీలోకి జయం రవి అత్త, ఆర్తి తల్లి సుజాత విజయ్ కుమార్ ఎంటరైంది. తన అల్లుడు చాలా అబద్ధాలు మాట్లాడుతున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఇతడితో సినిమాలు నిర్మించేందుకు ఏకంగా రూ.100 కోట్ల అప్పులు చేశానని చెప్పి షాకిచ్చింది.
'జయం రవి ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. తను ఎంకరేజ్ చేయడం వల్లే నేను నిర్మాతగా మారాను. ఇతడు హీరోగా.. అడంగ మరు, భూమి, సైరన్ సినిమాల్ని నిర్మించాను. ఈ మూవీస్ కోసం రూ.100 కోట్లు అప్పుగా తెచ్చా. ఇందులో 25 శాతం రెమ్యునరేషన్ గా తనకే ఇచ్చాను. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి'
(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్)
'జయం రవిని నేను ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు. కొడుకుగా భావించాను. అతడు ఎప్పుడూ బాధపడకూడదని అనుకున్నాను. అప్పుల వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను. వడ్డీలు కట్టుకునేదాన్ని. ఈ క్రమంలోనే సాయం చేస్తానని మాటిచ్చాడు కానీ చేయలేదు'
'సానుభూతి పొందడం కోసం జయం రవి ఇప్పుడు చేసే ఆరోపణలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. హీరో అనే భావన పోతోంది. అతడు ఎప్పుడూ ఓ హీరోగానే ఉండాలని కోరుకుంటున్నాను' అని సుజాత విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఎవరి నుంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)