
వేల మంది కష్టపడితేనే ఓ సినిమా తీయడం సాధ్యమవుతుంది. అదే మూవీ హిట్ అయితే గనక హీరో హీరోయిన్ లేదా దర్శకుడికే ఎక్కువ క్రెడిట్ వస్తుంది. కానీ ఇదే మూవీ కోసం పనిచేసిన చాలామందికి పెద్దగా గుర్తింపే దక్కదు. సరిగ్గా ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ అంటున్నాడు.
బాస్కో మార్టిస్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇతడు తెర వెనక మాత్రమే ఉంటాడు. తెలుగు, హిందీలో సూపర్ హిట్ అనిపించుకున్న చాలా పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. కానీ తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతేడాది రిలీజైన 'దేవర'లో చుట్టమల్లే పాటని కొరియోగ్రఫీ చేసింది కూడా ఇతడే.
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చుట్టమల్లే పాటకు తనకు గుర్తింపు దక్కకపోవడంపై తన బాధని బయటపెట్టాడు. 'దేవర ప్రమోషన్స్ లో జాన్వీ నా గురించి మాట్లాడి ఉండాల్సింది. కానీ పర్వాలేదులే. మన పని మనం చేసుకుంటే చాలు' అని బాస్కో మార్టిస్ చెప్పుకొచ్చాడు.
బాస్కో మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే జాన్వీ తన పేరు చెప్పకపోవడంపై బాధ పడుతున్నట్లు అనిపించింది. అలానే ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కి సరైన గుర్తింపు దక్కకపోవడం గురించి మరీ నేరుగా కాకపోయినా పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టినట్లు అనిపించింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన చిన్న చిన్న టెక్నీషియన్స్ కి కూడా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆ లెక్కన బాస్కో చాలా బెటర్!
(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)