విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త! | Kumkum Bhagya Actress Mugdha Chaphekar Separates From Her Husband Ravish Desai After 9 Years Of Marriage | Sakshi
Sakshi News home page

Mugdha Chaphekar Divorce: తొమ్మిదేళ్ల తర్వాత కుంకుమ భాగ్య సీరియల్ నటి విడాకులు

Apr 6 2025 4:03 PM | Updated on Apr 6 2025 5:42 PM

Kumkum Bhagya actress Mugdha Chaphekar separates from husband Ravish

విడాకులు అనే పదం ఈ రోజుల్లోనే కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెళ్లైన కొన్నేళ్లలోనే పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ బుల్లితెర నటి తన వైవాహిక బంధానికి గుడ్‌ బై చెప్పేసింది. బాలీవుడ్ బుల్లితెర నటి  ముగ్ధా చాఫేకర్ విడాకులు తీసుకున్నట్లు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు  రవీశ్ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత భర్త రవీశ్ దేశాయ్‌తో విడిపోయింది.

రవీశ్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "చాలా ఆలోచనల తర్వాత, ముగ్ధ , నేను మా సొంత మార్గాల్లో ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నాం. అందుకే భార్య,భర్తలుగా విడిపోవాలని డిసిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం  పట్టింది. ఇప్పటివరకు పరస్పరం ప్రేమ, స్నేహం, గౌరవంతో కలిసి ప్రయాణించాం. ఆమెతో ఉన్న రోజులు జీవితాంతం గుర్తుంటాయి." అని పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కావాలని అభిమానలను అభ్యర్థించాడు. అభిమానులు,  మీడియా మాపై దయతో మద్దతుగా ఉండాలని.. ఎటువంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని నటి భర్త కోరారు.

కాగా.. రవీశ్ దేశాయ్, ముగ్ధా చాఫేకర్ 2014లో సత్రంగి ససురల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ సీరియల్‌లో వీరిద్దరి  మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత డిసెంబరు 2016లో ముంబయిలో జరిగిన గ్రాండ్‌ వేడుకలో వీరి వివాహం జరిగింది. ప్రముఖ టీవీ సీరియల్‌ కుంకుమ భాగ్య సీరియల్‌లో ప్రాచీ మెహ్రా కోహ్లి పాత్రకు గానూ ముగ్ధా చాఫేకర్ బాగా ఫేమస్ అయింది. అలాహే రవీశ్ దేశాయ్ మేడ్ ఇన్ హెవెన్, షీ (సీజన్ 2), స్కూప్‌ లాంటి వెబ్ సిరీస్‌ల్లో కనిపించారు.  చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా విజయ్ 69లో కనిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement