
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై గత కొన్ని నెలలుగా విడాకులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ కూడా తమను విడదీయలేరని పేర్కొంది. గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.
తాజాగా మరోసారి తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్తపై అపారమైన నమ్మకం ఉందని తెలిపింది. ఎలాంటి తెలివితక్కువ మహిళ మమ్మల్ని వేరు చేయలేదని స్పష్టం చేసింది. గోవింద నేను లేకుండా జీవిస్తాడని అనుకోవడం లేదు.. తన కుటుంబాన్ని ఎలాంటి తెలివితక్కువ మహిళ కోసం వదిలి వెళ్లడని సునీతా వెల్లడించింది.
ఇప్పటికైనా రూమర్స్‌ను వ్యాప్తి చేయవద్దని ఆమె మీడియాను కోరింది. గోవిందతో తన వివాహం గురించి చర్చించడానికి ఏదైనా ఉంటే నేరుగా తన వద్దకు వచ్చి అడగాలని అహుజా అన్నారు. ఇలాంటి వాటిని ఎప్పటికీ అంగీకరించనని,.. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను నేరుగా అడగాలని తెలిపింది. ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే, మీడియాతో మొదట మాట్లాడే వ్యక్తిని నేనే.. ఆ దేవుడు నా కుటుంబాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయడని నమ్మకముందని పేర్కొంది. కాగా.. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.