
విడాకులు కోరిన జంటతో సుప్రీం
న్యూఢిల్లీ: మనసు విప్పి చర్చించుకుంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘మీకు మూడేళ్ల కొడుకున్నాడు. వైవాహిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడంలో భేషజాలెందుకు? గతమొక చేదుమాత్ర అనుకుని మర్చిపొండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి.
ఓ కప్పు చాయ్ తాగుతూ మాట్లాడుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ రాత్రి కలిసి భోంచేయండి. విభేదాలను సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి’’ అని విడాకుల కోసం తమను ఆశ్రయించిన ఓ జంటకు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.