
కొన్నేళ్ల ముందు సెలబ్రిటీలు ఎవరైనా సరే విడాకులు తీసుకుంటే సోషల్ మీడియాలో ఫొటో లేదంటే నోట్ పెట్టేవారు. కానీ రీసెంట్ టైంలో మాత్రం ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం లాంటివి చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి ఇలానే హీరోయిన్ హన్సిక విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈమె కూడా పెళ్లి ఫొటోలన్నీ తీసేయడంతో ఇవి నిజమేనని అందరూ అనుకుంటున్నారు.
ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా పూజ చేసిన హన్సిక.. భర్త లేకుండానే కనిపించింది. అలానే ఫొటోలు పోస్ట్ చేయగా ఇందులోనూ ఒంటరిగానే కనిపించింది. మెడలో తాళిబొట్టు కూడా లేదు. దీంతో విడాకులు కచ్చితమే అని ఈమెనే పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఈమె తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్)
2022 డిసెంబర్‌లో సోహైల్ కతూరియా అనే బిజినెస్‌మ్యాన్‌ని హన్సిక పెళ్లి చేసుకుంది. సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితోనే అతడికి ఇంతకుముందు వివాహమైంది. కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు హన్సిక నుంచి కూడా విడిపోయినట్లు కనిపిస్తున్నాడు. హన్సిక-సోహైల్ తమ పెళ్లి వేడుకని 'లవ్ షాదీ డ్రామా' పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ చేసి ఓటీటీలోనూ రిలీజ్ చేయడం విశేషం.
హన్సిక కెరీర్ విషయానికొస్తే 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈమె.. తెలుగు, తమిళంలో చాలా మూవీస్ చేసింది. ప్రస్తుతానికి కొత్త చిత్రాలేం చేస్తున్నట్లు లేదు. మధ్యలో ఒకటి రెండు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.
(ఇదీ చదవండి: హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్)