సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్ | Tamil Actor Vishal Gets Engaged to Actress Sai Dhanshika in a Simple Ceremony | Sakshi
Sakshi News home page

Vishal Engagement: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్

Aug 29 2025 12:54 PM | Updated on Aug 29 2025 1:38 PM

Actor Vishal Sai Dhanshika Engagement

తమిళ హీరో విశాల్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హీరోయిన్ సాయిధన్సికతో నిశ‍్చితార్థం చేసుకున్నాడు. చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తమిళం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. హీరోయిన్‌గా చేస్తున్న ధన్సిక ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. తామిద్దరం ఆగస్టు 29నలో పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్‌.. ఆ సంఘ(నడిగర్) భవనం ప్రారంభోత్సవం తర్వాత వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో చెప్పిన తేదీన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా సింపుల్‪‌గా ఈ వేడుక జరిగింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ ఖుష్బూ ఫ్యామిలీ ఫిట్‌నెస్ గోల్.. అందరూ ఒకేసారి)

సాయి ధన్సిక.. తమిళనాడు తంజావూరుకి చెందిన అమ్మాయి. 2006లో 'మనతోడు మజైకాలం' అనే తమిళ సినిమాతో నటిగా మారింది. మెరీనా అనే స్క్రీన్ నేమ్‌తో ప్రేక్షకులకు పరిచయమైంది. 2009లో 'కెంప' మూవీతో తనుషిక పేరుతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సాయి ధన్సిక పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. 'షికారు' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 'అంతిమ తీర్పు', 'దక్షిణ' లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ చేసింది.

విశాల్‌-ధన్సిక ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. కానీ విశాల్‌తో తనకు 15 ఏళ్ల పరిచయం ఉందని ధన్సిక చెప్పింది. గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని, కొన్నాళ్ల క్రితమే తామిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి కబురు కూడా చెబుతారేమో? 

(ఇదీ చదవండి: ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement