breaking news
Sai Dhansika.
-
హీరో విశాల్, సాయిధన్సిక ఎంగేజ్మెంట్..వైరల్ (ఫొటోలు )
-
సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్
తమిళ హీరో విశాల్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హీరోయిన్ సాయిధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తమిళం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. హీరోయిన్గా చేస్తున్న ధన్సిక ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్లో ఈ విషయాన్ని ప్రకటించారు. తామిద్దరం ఆగస్టు 29నలో పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్.. ఆ సంఘ(నడిగర్) భవనం ప్రారంభోత్సవం తర్వాత వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో చెప్పిన తేదీన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా సింపుల్‌గా ఈ వేడుక జరిగింది.(ఇదీ చదవండి: హీరోయిన్ ఖుష్బూ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్.. అందరూ ఒకేసారి)సాయి ధన్సిక.. తమిళనాడు తంజావూరుకి చెందిన అమ్మాయి. 2006లో 'మనతోడు మజైకాలం' అనే తమిళ సినిమాతో నటిగా మారింది. మెరీనా అనే స్క్రీన్ నేమ్‌తో ప్రేక్షకులకు పరిచయమైంది. 2009లో 'కెంప' మూవీతో తనుషిక పేరుతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సాయి ధన్సిక పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. 'షికారు' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 'అంతిమ తీర్పు', 'దక్షిణ' లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ చేసింది.విశాల్-ధన్సిక ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. కానీ విశాల్‌తో తనకు 15 ఏళ్ల పరిచయం ఉందని ధన్సిక చెప్పింది. గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని, కొన్నాళ్ల క్రితమే తామిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి కబురు కూడా చెబుతారేమో? (ఇదీ చదవండి: ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్)Thank u all u darlings from every nook and corner of this universe for wishing and blessing me on my special birthday. Happy to share the good news of my #engagement that happend today with @SaiDhanshika amidst our families.feeling positive and blessed. Seeking your blessings and… pic.twitter.com/N417OT11Um— Vishal (@VishalKOfficial) August 29, 2025 -
అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్ల అవుతున్నప్పటికీ తమిళ యువ హీరోయిన్ ధన్సికకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో తన పేరుని సాయి ధన్సికగా మార్చుకుంది. త్వరలో 'ది ప్రూఫ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న ఈమె.. ఈ చిత్ర ప్రమోషన్ల భాగంగా ముద్దు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)'మనదోడు మళైక్కాలం' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ధన్సిక.. పలు చిత్రాల్లో నటించింది. కానీ రజినీకాంత్ 'కబాలి'లో ఆయనకు కూతురిగా చేసిన తర్వాత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాలు చేస్తోంది గానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో తన పేరుని ధన్సిక నుంచి సాయి ధన్సికగా మార్చుకుంది. మరి ఈసారైనా ఆమె కోరుకున్న హిట్ వస్తుందేమో చూడాలి.ఇకపోతే తాను గ్లామర్ పాత్రల్లో నటించలేనని, ఎందుకంటే అలాంటి పాత్రలకు తాను సెట్ అవ్వనని సాయి ధన్సిక చెప్పింది. కావాలనే కొందరు దర్శకులు తనపై గ్లామర్ ముద్రని బలవంతంగా రుద్దుతారు. గ్లామర్‌గా నటించడం అనేది కథని బట్టి ఉంటుందని ధన్సిక చెప్పింది. తనకు బెడ్రూమ్, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!) -
సదా వన్నె తరగని అందం.. నవ్వుతో పడేస్తున్న రజినీ రీల్ కూతురు!
భూటాన్ విహారయాత్రలో హీరోయిన్ మాళవిక మోహనన్ గ్లామర్ డాల్‌లా మెరిసిపోతున్న ఒకప్పటి హీరోయిన్ సదా మేలిమి వజ్రంలా తళతళమంటున్న లైగర్ బ్యూటీ అనన్య రెడ్ డ్రస్‌లో ధగధగమని కనిపిస్తున్న సచిన్ కూతురు సారా బెల్లీ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసిన హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న సీరియల్ బ్యూటీ నవ్య స్వామి నవ్వుతో మాయ చేస్తున్న రజినీ రీల్ కూతురు ధన్సిక View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
కష్టపడుతున్న సూపర్‌స్టార్ కూతురు!
సాయి ధన్సిక ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కబాలి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీ కూతురుగా నటించి, తన అందంతో ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమా రిలీజైన తర్వాత అంతటా తన గురించే వార్తలు. ఇంతకీ ఎవరీమ్మాయి? అని కోలీవుడ్, టాలీవుడ్ అంతా ఆరాతీసింది. ఈ చిత్రంలో ధన్సిక తన స్టైల్, నటనతో అందరిని ఆకట్టుకుని మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ భామ వ్యాయామం చేసిన వీడియో ఒకటి సోషల్ హల్చల్ చేస్తోంది. ధన్సిక ‘ఉదయం పూట వ్యాయామం చేస్తే చాలా బాగుంటుందని, నేను జిమ్నాస్టిక్స్ కూడా చేస్తున్నాను’ అని తన ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘వాలుజడ’, తమిళ్లో మరో సినిమాను కూడా చేస్తుంది. Early morning classes are always good and here I’m doing my gymnastic front role and kart wheel 🤸🏼♂️ #trained by Pandianmaster pic.twitter.com/21Rks1PO3T — SaiDhanshika (@SaiDhanshika) January 6, 2018 -
ఎలాంటి పాత్రకైనా రెడీ
తమిళసినిమా: ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా తాను సిద్ధం అంటున్నారు నటి సాయి ధన్సిక. పేరాన్మమై చిత్రం ద్వారా దర్శకుడు జననాథన్ పరిచయం చేసిన నటి సాయిధన్సిక. ఆ చిత్రంలో జయంరవితో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించి ప్రత్యేకత చాటుకున్న తంజావూర్‌కు చెందిన అచ్చ తమిళమ్మాయి ఆ తరువాత కేరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయ్యిందనే చెప్పాలి. వరుసగా అవకాశాలు తలుపు తట్టడం, అవి నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కావడంతో తనదైన స్టైల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు సాయి ధన్సిక. కబాలి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కూతురుగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రజనీకాంత్ తరువాత అంత మంచి పేరు తెచ్చుకున్న నటి సాయి ధన్సికనే అని చెప్పాలి. అందుకు నిదర్శనం ఇటీవల ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డును గెలుచుకోవడమే. ఇక మరో విషయం ఏమిటంటే తను నటించిన ఉరు చిత్రం ఇటీవల విడుదలై మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతుండటం ఈ ఆనందాన్ని సాయిధన్సిక సోమవారం పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ ముచ్చట్లు చూద్దాం. ప్ర: ఉరు చిత్రంలో అద్దాలు పగలగొట్టుకొని దూసుకొచ్చే యాక్షన్ సన్నివేశాల్లో నటించిన అనుభవం గురించి? జ: ఆ యాక్షన్ సన్నివేశంలో నటించగలవా? అని దర్శకుడు అడిగారు. తానూ ఓకే అన్నాను. నిజంగా అది చాలా రిస్కీ షాటే. కరెక్ట్‌గా నేను అద్దంలోంచి దూకే సమయంలో ఒక వ్యక్తి పక్క నుంచి అద్దాన్ని పగలగొట్టారు. ఆ టైమింగ్ సింక్ అవడంతో ఆ సీన్ చాలా సహజంగా ఉంది. అయితే ఆ సన్నివేశాన్ని కులుమనాలిలో 4 డిగ్రీల చలిలో చిత్రీకరించారు. నేనే కాదు, నటుడు కలైయరసన్ తదితర చిత్ర యూనిట్ అంతా ఎంతో శ్రమించి పనిచేశారు. ఉరు చిత్రంలో నటించడానికి విల్‌పవర్ అవసరమైంది. ప్రశ్న: ఉరు చిత్రంపై మీ స్పందన? జ: దర్శకుడు కొత్తవాడైనా చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా చిత్ర సస్పెన్స్‌ను చాలా ఆసక్తిగా రీవీల్ చేశారు. చిత్రానికి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. చిత్ర వర్గాలు ఆన్లైన్ ప్రచారం బాగానే చేస్తున్నారు. అయితే పోస్టర్లలాంటివి ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. అయినా చిత్రం చూసిన వారి స్పందన బాగుంది. ఆ మౌత్ ప్రచారం చిత్రానికి బాగా హెల్ప్ అవుతుంది. ప్ర: అన్నీ యా„ýక్షన్ కథా పాత్రల్లోనే నటిస్తున్నట్లున్నారు. కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లో నటించే ఆలోచన లేదా? జ: అలాగని ఏమీ లేదు. వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. నాకు అలాంటి పాత్రలు రావడానికి బహుశ నేను వచ్చిన దర్శకుడు జననాథన్, బాలా లాంటి వారి స్కూల్ ఒక కారణం కావచ్చు. నా వరకూ నటిగా ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ. అది కమర్షియల్ కథానాయకి పాత్ర అయినా. అయితే పాత్రలు నాకు నచ్చాలి. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: తదుపరి కాలకూత్తు చిత్రం విడుదల కానుంది. ఇది మదురైలో చాలా కాలంగా జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఇందులోనూ నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాను. ఆ తరువాత ఇళిత్తిరు చిత్రం విడుదల కానుంది. ఇందులో విదార్ధ్, తంబిరామయ్యలతో కలిసి హాస్యం పండించాను. ఇంతకు ముందు మీరు అన్నట్లు కమర్షియల్ కథానాయకి పాత్రను ఈ చిత్రంలో చూడవచ్చు. వాటితో పాటు తమిళం, మలయాళం భాషల్లో సోలో అనే చిత్రాన్ని, తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వాలుజడ చిత్రాల్లో నటిస్తున్నాను. సోలో చిత్రంలో దుల్కర్సల్మాన్ హీరో. తెలుగు చిత్రం వాలుజడ మహిళా ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ప్ర: తమిళంతో పాటు తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తున్నారు. బాలీవుడ్కెళ్లే ఆలోచన ఉందా? జ: నిజం చెప్పాలంటే కబాలి చిత్రం తరువాత ఇతర భాషా చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అలానే హిందీలోనూ వస్తున్నాయి. అయితే తొందర పడదలచుకోలేదు. మంచి పాత్ర అనిపిస్తే హిందీలోనూ నటిస్తా.