
సరిగ్గా నెల క్రితం తమిళ నటుడు, చెఫ్ మదంపట్టి రంగరాజ్.. రెండో పెళ్లితో వార్తల్లో నిలిచాడు. నటీనటులు మరో పెళ్లి చేసుకోవడం పెద్ద విషయమేమి కాదు. కానీ ఇక్కడ రంగరాజ్ పెళ్లి చేసుకున్న మహిళ సెలబ్రిటీ స్టైలిష్ట్.. అప‍్పటికే ఆమె ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే అనుకుంటే ఇప్పుడో ఈ స్టోరీలో మరో ట్విస్ట్.
(ఇదీ చదవండి: స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా)
జూలై 26న తమిళ నటుడు రంగరాజ్.. స్టైలిష్ట్ జాయ్ క్రిసిల్డాని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రోజే తాను ఆరు నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నానని జాయ్.. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. రీసెంట్‌గా పదిరోజుల క్రితం కూడా భర్తతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ రీల్ పోస్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు భర్తపై జాయ్.. పోలీస్ కేసు పెట్టింది. గర్భం దాల్చిన తర్వాత పెళ్లయితే చేసుకున్నాడు గానీ తనని పట్టించుకోవట్లేదని, మోసం చేశాడని చెప్పి చెన్నై పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసింది.
రంగరాజ్ స్వతహాగా చెఫ్. పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తమిళంలో మెహందీ సర్కస్, పెంగ్విన్ సినిమాల్లో నటుడిగానూ చేశాడు. ఇదివరకే ఇతడికి పెళ్లయింది. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. నెల క్రితం స్టైలిష్ట్ జాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈమెతో పాటు కాకుండా తొలి భార్యతోనే ఉంటున్నాడు. రీసెంట్‌గా మొదటి భార్యతో కలిసి ఓ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. ఈ విషయం గురించే అడిగితే రంగరాజ్ తనపై దాడి చేశాడని జాయ్ అంటోంది. పెళ్లి తర్వాత నుంచి తనతో కలిసి ఉండేందుకు రంగరాజ్ ఇష్టపడట్లేదని చెబుతోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ ఖుష్బూ ఫ్యామిలీ ఫిట్‌నెస్ గోల్.. అందరూ ఒకేసారి)