హీరోయిన్ సోనాక్షి సిన్హా.. నటుడు జహీర్ ఇక్బాల్ ని గతేడాది పెళ్లిచేసుకుంది.
పెళ్లి తర్వాత నుంచి ఈమెపై ట్రోలింగ్ సాగుతూనే ఉంది.
తాజాగా ఓ నెటిజన్.. మీరు కూడా త్వరలో విడాకులు తీసుకుంటారులే అని కామెంట్ చేయగా.. సోనాక్షి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
అవునా.. ముందు మీ అమ్మానాన్నకు విడాకులు అవనీ.. తర్వాత కచ్చితంగా మేము తీసుకుంటాం, ఒట్టు అని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది.


