
కోలీవుడ్ హీరో జయం రవి ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా ఆయన భార్య, జయం రవి ఒకరిపై ఒకరు పెద్దఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. తనను వేధింపులకు గురి చేశారంటూ జయం రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడాకులకు దారితీసిందని ఆరోపించింది. విడాకుల విషయంలో ఇప్పటికే వీరిద్దరు కోర్టుకు కూడా హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జయం రవి భార్య ఆర్తి ఓ బిగ్ షాకిచ్చింది. ఈ వివాదం గురించి చేసిన పోస్టులన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని హైకోర్టు ఆదేశించండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవి తన భార్య ఆర్తితో పాటు అత్త సుజాతకు నోటీసులు పంపారు. తమ విభేదాల గురించి మాట్లాడటం మానేయాలని వారిద్దరికీ లీగల్ నోటీసు పంపారు. అంతేకాకుండా నటుడికి పరువు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పంపించారు.
అదేవిధంగా ఆర్తి సైతం.. రవి మోహన్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆర్తితో పాటు అత్త సుజాతపై పోస్టులు చేయకుండా ఆపేయాలని హైకోర‍్టు ఆదేశించింది. దీంతో ఆర్తి హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. న్యాయ వ్యవస్థ పరువు నష్టం నుంచి రక్షణ కల్పించడం.. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయాన్ని కాపాడిందని ఆమె పోస్ట్‌కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. కాగా.. జయం రవి, ఆర్తి 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు.