విడాకుల వార‍్తలు.. స్పందించిన ప్రముఖ బుల్లితెర నటి! | TV Actress Aishwarya Sharma Reacts On Divorce Rumours And Social Media Trolls, More Details Inside | Sakshi
Sakshi News home page

Aishwarya Sharma: 'మౌనంగా ఉంటే తప్పు చేసినట్లు కాదు'..విడాకులపై బుల్లితెర భామ!

Nov 17 2025 7:55 PM | Updated on Nov 17 2025 8:27 PM

Television actress Aishwarya Sharma responded her divorce rumours

ఈ రోజుల్లో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. కొందరైతే చిన్న చిన్న కారణాలకే బైబై..టాటా చెప్పేస్తున్నారు. విడాకులు అనేది కేవలం ఒక్క సినీ ఇండస్ట్రీకే  కాదు.. సామాన్యుల్లోనూ ఇలాంటి పరిస్థితులు సాధారణమైపోయాయి. కాకపోతే సినిమా వాళ్లకు సంబంధించి ఎక్కువగా ఇలాంటివి వినిపిస్తుంటాయి. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి ఐశ్వర్య శర్మపై విడాకులు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. తన భర్త నీల్ భట్‌తో ఆమె త్వరలోనే విడిపోతున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.

దీంతో తనపై వస్తున్న విడాకుల వార్తలపై బుల్లితెర నటి స్పందించింది. నా జీవితం గురించి వాస్తవాలు తెలియకుండా ఎలా పడితే అలా రాస్తున్నారని మండిపడింది. ఈ వార్తలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు నిశ్చితార్థం నుంచే ఇలాంటి ట్రోల్స్‌ వస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి ప్రచారంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది.

ఐశ్వర్య శర్మ ఇన్‌స్టాలో రాస్తూ.. "ప్రజలు నా జీవితం గురించి ఒక్క వాస్తవం కూడా తెలియకుండానే అంచనా వేస్తున్నారు. కర్మ అనేది ఒకటుంది కదా. ఏదైనా నమ్మే ముందు నాతో పనిచేసిన వారిని, నా సహ నటులను, నిర్మాతలను నా గురించి అడగండి. సెట్‌లో ఎవరినైనా ఎప్పుడైనా బెదిరించడం.. అగౌరవపరిచడం చేశానేమో చెప్తారు.  సెట్‌లో కేవలం నా పనిపైనే శ్రద్ధపెడతా. ఇక్కడ నేను బెదిరింపులకు గురవుతున్నానని ఎవరూ చెప్పరు.  అది అందరికీ ఎందుకు కనిపించదు? నా నిశ్చితార్థం అయినప్పటి నుంచి ట్రోలింగ్‌కు గురవుతున్నా. అయినా వాటిని చిరునవ్వుతోనే అంగీకరించా. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడరు.  నేను మాట్లాడే ప్రతిసారీ వక్రీకరించి వ్యూస్ కోసం నా పేరును ఉపయోగిస్తారు. కానీ మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. నేను నెగెటివ్‌ను ప్రోత్సహించకూడదని నిర్ణయించుకున్నా' అని తెలిపింది.

తనపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐశ్వర్య శర్మ స్పష్టం చేసింది. నా జీవితంలో ఎవరినీ ఎప్పుడూ వేధించలేదని.. స్వలాభం కోసం అబద్ధాలు వ్యాప్తి చేసే వ్యక్తులు తమ కర్మ గురించి ఆలోచించాలని హితవు పలికింది. మీకు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తి గురించి తప్పుగా చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరింది. నేను మౌనంగా ఉంటే మీ ఇష్టం మొచ్చినట్లు రాసుకోండని కాదు.. నా స్వంత వైఖరితో  గౌరవాన్ని కాపాడుకుంటానని ఐశ్వర్య శర్మ తెలిపింది. 

కాగా.. ఐశ్వర్య, నీల్ భట్ 'ఘుమ్ హై కిసికే ప్యార్ మే' అనే సీరియల్ సెట్‌లో కలుసుకున్నారు. ఇందులో ఆమె పాఖి అనే పాత్ర పోషించింది. ఆ తర్వాత ఈ జంట 2021లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత 'స్మార్ట్ జోడి', 'బిగ్ బాస్ 17' వంటి రియాలిటీ షోలలో కనిపించారు. ‍అయితే వీరిద్దరు జంటగా బయట ఎక్కడా కనిపించకపోవడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య శర్మ స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement