
గత కొంతకాలంగా బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా ఆయన భార్యతో విడిపోతున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో చాలాసార్లు ఈ టాపిక్ తెరపైకి వచ్చినా.. ఆయన భార్య సునీతా వాటిని కొట్టిపారేసింది. ఇటీవల మరోసారి ఈ జంట విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత వీటిని గోవిందా తరఫు లాయర్ ఖండించారు. వీరిద్దరి విడాకులకు సంబంధించి ఏ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయలేదని అభిమానులకు వెల్లడించారు.
ఇవాళ వినాయక చవితి సందర్భంగా తమపై వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు గోవిందా దంపతులు. గణనాథునికి సతీసమేతంగా పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా గోవిందా భార్య సునీతా అహుజా తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై స్పందించారు. ఆ దేవుడు కూడా తమను వేరు చేయలేడంటూ కామెంట్స్ చేసింది. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న డివోర్స్ రూమర్స్‌కు ఇక చెక్ పడినట్లే.
విడాకుల వార్తలపై సునీతా మాట్లాడుతూ.. "ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మేము చాలా దగ్గరగా ఉండేవాళ్లం కాదు. మా మధ్య మరింత దూరం ఉండేది. పై నుంచి దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. నా గోవిందా నా వాడు మాత్రమే, మరెవరికి ఆయన హృదయంలో స్థానం లేదు. కాదు. మేము నోరు తెరిచి చెప్పే వరకు దయచేసి మా గురించి వచ్చే వార్తలను నమ్మొద్దు" అని హితవు పలికింది. కాగా.. గోవింద భార్య సునీతా అహుజా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేయడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. సునీత ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
కాగా.. గోవిందా కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, హసీనా మాన్ జాయేగి, హద్ కర్ ది ఆప్నే, జోడి నంబర్ 1 లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా 'రంగీలా రాజా' అనే చిత్రంలో కనిపించారు.
#WATCH | Mumbai | Denying rumours of filing for divorce from husband actor Govinda, Sunita Ahuja says, "If something had happened, then we would have been so close today. There would have been a distance between us. No one can separate us, not even if God comes from above... My… pic.twitter.com/Aj5NmlbGNV
— ANI (@ANI) August 27, 2025