ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..! | Madhura Nagar Pawan Kumar Pet Dog Incident | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!

May 5 2025 7:47 AM | Updated on May 5 2025 1:28 PM

Madhura Nagar Pawan Kumar Pet Dog Incident

వెంగళరావునగర్‌(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్‌కుమార్‌ (37) తన స్నేహితుడు సందీప్‌తో కలిసి పదేళ్లుగా మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. 

ఉదయం సందీప్‌ తలుపు తట్టగా పవన్‌ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్‌ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్‌కుమార్‌కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement