
హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆమె భర్తకు దూరంగా ఉందని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హన్సిక తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా పుట్టిన రోజు (ఆగస్ట్ 9) వేడుకలు జరుపుకున్న ఆమె.. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని..ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు.
‘ఈ ఏడాది(2025) నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోతోంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని హన్సిక ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. దీంతో మరోసారి హన్సిక విడాకుల విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహైల్ని వివాహం చేసుకుంది. సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.