
కోలీవుడ్ స్టార్ జంట నయనతార- విఘ్నేశ్ శివన్‌పై కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు త్వరలోనే తమ వివాహాబంధానికి గుడ్ బై చెప్పనున్నారని టాక్ వినిపించింది. ఈ స్టార్ కపుల్ గురించి పలు వెబ్‌సైట్స్‌లో కథనాలొచ్చాయి. దీంతో నయనతార తమపై వస్తున్న రూమర్స్‌కు గట్టి రిప్లై ఇచ్చింది. తన భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. 'మాపై సిల్లీ న్యూస్ వచ్చినప్పుడల్లా మా రియాక్షన్ ఇలానే ఉంటుంది' అని ఘాటుగానే బదులిచ్చింది.
కాగా.. పెళ్లి బంధం గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఈ రూమర్స్‌కు కారణమైంది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు.. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అంతలోనే నెట్టింట స్క్రీన్‌షాట్స్ దర్శనమిచ్చాయి. ఆ పోస్ట్ వల్లే నయన్- విఘ్నేశ్ దంపతులు విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో కోలీవుడ్‌లో వీరిద్దరి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఇక నయనతార సినిమాలపరంగా చూస్తే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 157లో కనిపించనుంది. అంతేకాకుండా యశ్ హీరోగా వస్తోన్న టాక్సిక్ మూవీలోనూ కనిపించనుంది. కాగా.. నయనతార సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టుకున్నారు.