విడాకుల కేసు.. ఒకే కారులో వచ్చివెళ్లిన సెలబ్రిటీ జంట | GV Prakash And Saindhavi Divorce Came Court On Same Car | Sakshi
Sakshi News home page

GV Prakash: స్టార్ ‍మ్యూజిక్ డైరెక్టర్.. భార్యతో కోర్టుకి వచ్చి

Mar 24 2025 6:25 PM | Updated on Mar 24 2025 6:35 PM

GV Prakash And Saindhavi Divorce Came Court On Same Car

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar).. గతేడాదే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దాదాపు 11 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పాడు. తాజాగా భార్యతో కలిసి విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ ఒకే కారులో వచ్చి వెళ్లడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు, తమిళంలో అడపాదడపా సినిమాలకు సంగీతమందిస్తున్న జీవీ.. మధ్య మధ్యలో హీరోగానూ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. కెరీర్ పరంగా బాగానే ఉంది. మరి ఏమైందో ఏమో గానీ గతేడాది మేలో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చాడు. చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని (Saindhavi) జీవీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అన్వీ అనే కూతురు కూడా ఉంది.

(ఇదీ చదవండి: నెల క్రితం గాయం.. 'మన్మథుడు' హీరోయిన్ కి ఏమైంది?)

విడాకులు కారణాలేంటనేది బయటపెట్టలేదు గానీ గతేడాది ప్రకటించిన తర్వాత నుంచి వేర్వేరుగానే నివసిస్తున్నారట. కానీ తాజాగా సోమవారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకి మాత్రం ఒకే కారులో వచ్చారు. విడాకుల కోసం అర్జీ దాఖలు చేశారు. కానీ వాయిదా పడటంతో తిరిగి ఒకే కారులో వెళ్లిపోయారు. 

సాధారణంగా విడాకులు తీసుకుంటున్నారంటేనే ఎవరికి వారు యుమునా తీరే అన్నట్లు విడివిడిగా వస్తుంటారు. కానీ జీవీ-సైంధవి మాత్రం ఒకే కారులో వెళ్లిరావడం అక్కడున్న వాళ్లని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement