'అలాంటి వారు కుక్కలతో సమానం'.. గోవింద భార్య ఘాటు వ్యాఖ్యలు | Bollywood actor Govinda wife Sunita Ahuja gets angry over divorce rumours | Sakshi
Sakshi News home page

Sunita Ahuja: 'కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. విడాకుల రూమర్స్‌పై గోవింద భార్య ఆగ్రహం

Apr 8 2025 6:05 PM | Updated on Apr 8 2025 6:47 PM

Bollywood actor Govinda wife Sunita Ahuja gets angry over divorce rumours

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో సీనియర్ ‍నటుడు గోవింద పేరు గత కొన్ని నెలలుగా ఎక్కువగా  వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్‌ బై చెప్పనున్నారని ఇప్పటికే చాలాసార్లు వార్తలొచ్చాయి. అలాంటిదేమీ లేదని తనపై వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. అప్పట్లో బాలీవుడ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న గోవింద.. సునీతా అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా సైతం స్పందించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ‍మాట్లాడిన ఆమె మరోసారి వీటిపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరైన సునీతా అహుజా తన వివాహం గురించి జరుగుతున్న ఉహాగానాలు చూస్తుంటే కలతగా ఉందని తెలిపింది. ఇలాంటి నిరాధారమైన వాటిని వ్యాప్తి చేసేవారిని నమ్మవద్దని అభిమానులను కోరింది.

సునీతా మాట్లాడుతూ..'అది పాజిటివ్ అయినా..నెగెటివ్ అయినా.. నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. మాపై ఇలాంటివీ సృష్టించేవారు కుక్కలతో సమానం. అందుకే అవి మొరుగుతాయి." అని కాస్తా గట్టిగానే ఇచ్చిపడేసింది. కాగా.. ఫిబ్రవరిలో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని గోవింద తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.  కానీ వీరికి ‍అత్యంత సన్నిహితుడు కుటుంబ స్నేహితుడై లలిత్ బిందాల్ అనే వ్యక్తి సునీతా అహుజా దాదాపు ఆరు నెలల క్రితమే విడాకుల కోసం దాఖలు చేశారని చెప్పారు. ఆ తర్వాతే విడాకుల రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.

కాగా.. సునీతా అహుజాను మార్చి 1987లో గోవింద వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే కుమార్తె టీనాకు ఆ జంట స్వాగతం పలికారు. వీరికి యశ్వర్ధన్ అనే కుమారుడు 1997లో జన్మించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement