
ఇటీవల హీరోయిన్ హన్సిక మోత్వానిపై వ్యక్తిగత జీవితంపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ఆమె త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నెల ఆగస్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని..ఎన్నో పాఠాలు నేర్పిందంటూ ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. కాగా సోహల్‌కు ఇది రెండో పెళ్లి కావడంతో మనస్పర్థలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(ఇది చదవండి: విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?)
తాజాగా హన్సికి మోత్వానీ ఇండోనేషియాలోని బాలిలో చిల్ అవుతూ కనిపించింది. తన ఫ్రెండ్తో కలిసి వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలు చూసి నవ్వుతూ కనిపించింది. తన వ్యక్తిగత జీవితంపై నెటిజన్స్ కామెంట్స్ చూస్తూ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. నా జీవితంపై ప్రజల అభిప్రాయాన్ని నేను చదివినప్పుడు అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోతో తనపై వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టేసినట్టే కనిపిస్తోంది. అయితే విడాకుల రూమర్స్పై ఇప్పటివరకు హన్సిక కానీ, ఆమె భర్త సోహెల్ కూడా స్పందించలేదు. తన ఇన్స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి.

కాగా.. 2022 డిసెంబర్‌లో హన్సిక తన ప్రియుడు సోహైల్‌ని వివాహం చేసుకుంది. సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు.