
బాలీవుడ్ నటీనటులకు ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వసాధారణం అనే టాక్ బయట ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది స్టార్స్ కొన్నాళ్లకే విడిపోయారు. పలువురు విడాకులు తీసుకొని మరోపెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రూపాయికి ఇంకో వైపు ఉన్నట్లుగా.. బాలీవుడ్ తారల్లో మరో కోణం కూడా ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత..మరో పెళ్లి చేసుకొని తారలు కూడా ఉన్నారు. పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి.. సింగిల్‌గానే ఉంటూ కెరీర్‌పై దృష్టిసారించిన కొంతమంది బాలీవుడ్ స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.
మనీషా కొయిరాలా
మనీషా కొయిరాలా, 1990లలో తన అందం, నటనతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన నటి. 'దిల్ సే', 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె, 2010లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. అయితే, వివాహం జరిగిన ఆరు నెలలకే వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మనీషా మరో పెళ్లి చేసుకోకుకండా ఒంటరిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కొనసాగుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.
పూజా భట్
పూజా భట్, 'దిల్ హై కి మాంతా నహీ', 'సడక్' వంటి చిత్రాలతో పాపులర్ అయిన నటి మరియు నిర్మాత. ఆమె 2003లో వ్యాపారవేత్త మనీష్ మఖీజాను వివాహం చేసుకుంది, కానీ 2014లో వారు విడిపోయారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా.. ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం, దర్శకత్వంలో బిజీగా ఉన్నారు.
చిత్రాంగద సింగ్
చిత్రాంగద సింగ్, 'హజారోం ఖ్వాహిషే ఐసీ', 'దేశీ బాయ్జ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి. ఆమె 2001లో గోల్ఫర్ జ్యోతి రంధావాను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, 2013లో వారు విడిపోయారు, 2014లో విడాకులు ఖరారయ్యాయి. చిత్రాంగద తన కెరీర్‌పై దృష్టి సారించి, సినిమాల్లో నటిస్తూ, సింగిల్ మదర్‌గా తన కుమారుడిని పెంచుతోంది. ప్రస్తుతం వరకు ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు, తన వృత్తి, కుటుంబంపై దృష్టి పెట్టింది.
కరిష్మా కపూర్
'రాజా హిందుస్థానీ', 'దిల్ తో పాగల్ హై' వంటి చిత్రాలతో 90లలో స్టార్‌డమ్ సంపాదింకున్న నటి కరిష్మా కపూర్. ఆమె 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకుంది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వైవాహిక సమస్యల కారణంగా 2014లో విడిపోయి, 2016లో విడాకులు తీసుకుంది. కరిష్మా ప్రస్తుతం సినిమా నిర్మాణంలో నిమగ్నమై, తన పిల్లల సంరక్షణపై దృష్టి సారిస్తూ సింగిల్‌గా జీవిస్తోంది. ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు.
రేఖా
బాలీవుడ్ దిగ్గజ నటి రేఖా, తన అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె 1990లో వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది, కానీ ఈ వివాహం కేవలం ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది. ముఖేష్ 1991లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత రేఖ మళ్లీ వివాహం చేసుకోలేదు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ తారలు విడాకుల తర్వాత ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు.