
విడాకుల వార్తలపై షోయబ్ మాలిక్ స్పందన
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మూడో వివాహ బంధం కూడా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. మూడో భార్య, నటి సనా జావెద్ (Sana Javed)తో విడాకులు తీసుకోవడానికి షోయబ్ సిద్ధపడ్డాడనేది వాటి సారాంశం.
మనసు స్వచ్ఛంగా ఉన్నపుడు..
ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉన్నపుడు.. దానిని బయటకు చూపించేందుకు ఎలాంటి కృత్రిమ ఫిల్టర్ల అవసరం ఉండదు’’ అంటూ సానియా తన కుమారుడు ఇజహాన్, స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
కాగా టెన్నిస్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన హైదరాబాదీ సానియా మీర్జా.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఆయేషా సిద్ధిఖీ అనే మహిళతో షోయబ్‌కు వివాహం కాగా.. 2006లోనే విడాకులు తీసుకున్నాడు.

షోయబ్‌కు సానియా విడాకులు
అయితే, సానియా మీర్జాతోనూ షోయబ్ బంధం ఎక్కువకాలం నిలవలేదు. 2023లో తాను షోయబ్‌కు విడాకులు ఇచ్చినట్లు సానియా మీర్జా గతేడాది ప్రకటించింది. అయితే, అంతకంటే ముందే నటి సనా జావెద్‌ను పెళ్లాడిన ఫొటోలను షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
ఇక సనాకు ఇది రెండో వివాహం కాగా.. షోయబ్‌కు మూడోది. అయితే, పెళ్లికి ముందే వీరిద్దరు తమ పాత బంధాలను కొనసాగిస్తూనే.. ‘రిలేషన్‌షిప్’లోనే ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సనా తన భర్తకు, షోయబ్ తన భార్యకు విడాకులు ఇచ్చి 2024లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.
ఆ ఫొటోలతో వదంతులకు చెక్
అయితే, సనా- షోయబ్ మధ్య కూడా సఖ్యత చెడినట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. ఓ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చునప్పటికీ దూరం దూరంగా ఉండటం.. షోయబ్ ఆటోగ్రాఫులు ఇస్తున్నపుడు సనా ముఖం తిప్పేసుకోవడం ఇందుకు ఊతమిచ్చాయి.
దీంతో సనా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే, భర్త షోయబ్‌తో కలిసి అమెరికాలో విహరిస్తున్న ఫొటోలను పంచుకోవడం ద్వారా సనా జావెద్ ఈ వదంతులకు చెక్ పెట్టింది.
ఇద్దరూ కలిసి హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోస్‌ను సందర్శించిన ఫొటోలను సనా షేర్ చేసింది. షోయబ్ కూడా ఇవే ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘తనతో కలిసి ఇలా విహరించడం ఎల్లపుడూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు.
సానియా మీర్జా పోస్ట్ వైరల్
ఇదిలా ఉంటే.. సానియా- షోయబ్‌లకు సంతానంగా కుమారుడు ఇజహాన్ జన్మించాడు. సానియా తన కుమారుడితో కలిసి ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో పదమూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న సానియా మీర్జా ఎప్పటికప్పుడు ఫొటోలు పంచుకుంటూనే ఉంటుంది.
అయితే, శనివారం ఆమె పంచుకున్న ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్.. షోయబ్ మూడో పెళ్లి పెటాకులు అన్న వార్తల వేళ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం