పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) వివాహం గురించి మరోసారి వార్తల్లో నిలిచాడు. ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి కూడా ముక్కలు కానుందా? తాజా వార్తలు ఈ ఊహాగానాలనే బలపరుస్తున్నాయి. భార్య, నటి సనా జావేద్ (Sana Javed)తో విభేదాల కారణంగా విడాకుల బాట పట్టినట్టు వార్తలొస్తున్నాయి.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza)తో 14 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి సనా జావేద్‌ను వివాహం చేసున్నాడు షోయబ్. అప్పటినుంచి చెట్టాపట్టా లేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇటీవలదూరంగా ఉంటున్నారట. తాజా మీడియా నివేదిక ప్రకారం, మనస్పర్థలతో షోయబ్-సనా జంట విడాకులకు సిద్దమవుతోంది.
ఇటవలి ఒక సందర్భంగా షోయబ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా సనా మొఖం తిప్పుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోకుండా సీరియస్‌గా ఉండటం ఒకే సోఫాలో కూర్చున్నప్పటికీ దూరం దూరంగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో మూడో పెళ్లి ముచ్చట కూడా మూణ్నాళ్లే.. ఇద్దరి మధ్య మాటల్లేవా అంటూ కొందరు, భార్యభర్తల మధ్య ఇలాంటివి మామూలే అని కొందరు నెటిజన్లు కమెంట్స్ చేశారు. అయితే, అటు షోయబ్ గానీ, ఇటు సనా గానీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు
కాగా షోయబ్ మాలిక్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న, హైదరాబాద్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి కొడుకు (ఇజాన్) పుట్టాడు. విభేదాల కారణంగా 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే.


