
తమిళ హీరో జయం రవి.. భార్య ఆర్తికి గతేడాది విడాకులు ఇచ్చేశాడు. దాదాపు 18 ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. కెన్నీషా అనే సింగర్ తో సదరు హీరో డేటింగ్ చేస్తున్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి పెళ్లి జరగ్గా.. జయం రవి కెన్నీషాతో కలిసి జంటగా వచ్చాడు.
(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే)
ఉదయం నుంచి జయం రవి-కెన్నీషా కలిసున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఈ టైంలో మాజీ భార్య ఆర్తి చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని ఇంటి నుంచి తరిమేశారని, జయం రవికి అసలు పిల్లలు బాధ్యత అనేదే లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
'ఏడాది పాటు మౌనాన్ని కవచంలా మోస్తున్నాను. నా కొడుకులు ప్రశాంతంగా ఉండాలి కాబట్టే ఇవన్నీ భరిస్తున్నాను. నాపై లేనిపోని ఆరోపణలు చాలా చేశావ్. అయినా సరే నేను నోరు మెదపలేదు. ఎందుకంటే నా కొడుకులు.. తల్లిదండ్రులు విడిపోయారనే బాధని అనుభవించకూడదు కాబట్టి. అంతే తప్ప నా దగ్గర నిజం లేదని కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఫొటోలు చూస్తోంది. కానీ మా మధ్యలో జరిగింది వేరు. విడాకుల ప్రక్రియ ఇంకా నడుస్తోంది. నాతో పాటు 18 ఏళ్లు సంసారం చేసిన వ్యక్తి.. ప్రేమ, నమ్మకంతో పాటు ప్రామిస్ చేసిన ప్రతి బాధ్యతని పక్కనబెట్టి నన్ను వదిలి వెళ్లిపోయాడు. నా బాధ్యత అని చెప్పిన ఆ వ్యక్తి.. నాకు ఆర్థికంగా అండగా నిలబడం, మాట సాయం గానీ చేయట్లేదు'
'ప్రస్తుతం మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. నాతో కలిసి ఇదే ఇంటిని నిర్మించిన సదరు వ్యక్తి.. బ్యాంక్ అధికారులతో కలిసి నేను బయటకు వెళ్లిపోయేలా చేశాడు. నేను డబ్బుల కోసమే ఈ విడాకుల డ్రామా ఆడుతున్నానని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో నా స్వార్థం చూసుకునేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ప్రేమని పంచాను. నమ్మకం చూపించాను. ఇప్పుడదే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది'
'ప్రేమించినందుకు పశ్చాత్తాపపడట్లేదు గానీ దాన్ని ఓ బలహీనతలా ఉపయోగించుకున్నందుకు బాధపడుతున్నాను. నా కొడుకుల వయసు 10, 14 ఏళ్లు. వాళ్లకు ఇప్పుడు కావాల్సింది భద్రత.. షాక్ కాదు, నిశ్బబ్దం కాదు. ఈ చట్టాల గురించి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు వాళ్లు. సమాధానం లేని కాల్స్, రద్దయిన మీటింగ్స్.. ఇవన్నీ నాకు తగిలిన గాయాలు. నేను ఈరోజు మాట్లాడేది భార్యగా కాదు. అలా అని స్త్రీకి అన్యాయం చేసిన దానిలా కూడా కాదు. పిల్లల శ్రేయస్సు కోసం ఆలోచించే తల్లిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతాను'
'నువ్వు ఏమైనా చేయొచ్చు గానీ నిజాన్ని తిరిగి రాయలేవు కదా. తండ్రి అంటే టైటిల్ కాదు అదో బాధ్యత. మా విడాకుల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నా పేరు వెనక రవి అని ఉంటుంది. మీడియా వాళ్లకు చెప్పేదేంటంటే నన్ను మాజీ భార్య అని సంభోదించొద్దు. మేం ఇంకా లీగల్ గా విడాకులు తీసుకోలేదు. ప్రతికారమో మరేదో కాదు,పిల్లల్ని కాపాడే తల్లిగా ఇది నా బాధ్యత. నేను ఏడవను. గట్టిగా అరిచి గోలపెట్టను. కానీ బలంగా నిలబడతా. నిన్ను ఇంకా నాన్న అని పిలుస్తున్న ఇద్దరబ్బాయిల కోసం నేను అస్సలు తగ్గను' అని ఆర్తి రవి రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)