
కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుతుతోంది. ప్రస్తుతం వీరిద్దరి పంచాయతీ కోర్టులో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఓ పెళ్లిలో జయంరవి.. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా హాజరు కావడంతో వీరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జయం రవి తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని.. పంజరం నుంచి బయటపడ్డానని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.
తాజాగా ఆయన భార్య సైతం తామిద్దరం మూడో వ్యక్తి వల్లే విడిపోవాల్సి వచ్చిందని మూడు పేజీల లేఖను విడుదల చేసింది. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందనడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.
ఒకవైపు వీరిద్దరు విడాకుల కోసం కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. అంతలోనే ఆర్తి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనకు నెలకు రూ.40 లక్షల భరణం చెల్లించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే వీరిద్దరు ఇటీవల విడాకుల కేసులో కోర్టుకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆర్తి భరణం కోరుతూ పిటిషన్ వేయడంతో కోలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది