
సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ హన్సిక(Hansika Motwani) విడాకులు తీసుకోనున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఆమె భర్త సోహైల్ కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ.. అందులో నిజం లేదని తేల్చిపారేశాడు. అయినప్పటికీ రూమర్స్ మాత్రం తగ్గలేదు. ఇలాంటి సమయంలో హన్సిక తమ పెళ్లి ఫోటోలను సోషల్మీడియా ఖాతల నుంచి తొలగించేసి అశ్చర్య పరిచింది. దీంతో వారి విడాకుల అంశం నిజమనేలా సంకేతాన్ని ఇచ్చింది.
2022లో సోహైల్తో హన్సిక వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే, కొద్దిరోజులుగా భర్తతో మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫోటోలను తొలగించేసింది. దీంతో వారు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి.

సోహైల్‌కు రెండో పెళ్లి
సోహైల్, హన్సిక చిన్ననాటి స్నేహితులు.. రింకీ బజాజ్ అనే యువతిని సోహైల్ మొదట పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్‌తో కనెక్ట్ అయిన హన్సిక అతడిని వివాహం చేసుకుంది. జైపూర్‌లో జరిగిన ఈ పెళ్లి విశేషాలను లవ్ షాదీ డ్రామా వీడియో పేరిట ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. అందులో హన్సిక.. సోహైల్ గతం గురించి చెప్తూ ఎమోషనలైంది. సోహైల్ గతం గురించి తెలుసు, కానీ.. అతడి విడాకులతో తనకు సంబంధం లేదని ఏడ్చేసింది.