వరంగల్: ఉమ్మడి జిల్లా జనగామలో అర్ధరాత్రి వేళ నిలిపి ఉంచిన బస్సును ఓ వ్యక్తి దొంగతనం చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. విధులు ముగించుకున్న ఆర్టీసీ డ్రైవర్లు జనగామ బస్టాండ్‌లో రాత్రి అక్కడే బస్సును నిలిపిఉంచారు.
అయితే, పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తి బస్టాండ్ సిబ్బంది నిద్రిస్తున్నవేళ ఆర్టీసీ అద్దె బస్సును స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. సూర్యాపేట వైపు సుమారు 21 కిలోమీటర్ల దూరం నడిపాడు. అలా.. సింగరాజుపల్లి టోల్ గేట్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టడంతో అక్కడే ఆగిపోయింది. బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడు మద్యం సేవించి ఉండటంతో, ఆ మత్తులోనే ఇదంతా జరిగినట్లుగా తెలుస్తోంది. నిందితుడు వెంకన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.
మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి
జనగామ బస్టాండులో నిలిపి ఉన్న అద్దె ఆర్టీసీ బస్సును మద్యం మత్తులో ఎత్తుకెళ్లిన పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తి
జనగామ నుండి సూర్యాపేట వైపు దాదాపు 21 కిలోమీటర్లు బస్సు తీసుకెళ్లిన క్రమంలో, సింగరాజుపల్లి టోల్ ప్లాజా వద్ద… pic.twitter.com/lo0Ho21wyf— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026


