భాగమతి మూవీ దర్శకుడిపై కేసు నమోదు | Cyberabad Economic Offences Wing Case Registered Against Director Gudluri Ashok Babu And Producer Vijayalakshmi | Sakshi
Sakshi News home page

భాగమతి మూవీ దర్శకుడిపై కేసు నమోదు

Jul 11 2026 7:38 AM | Updated on Jul 11 2026 7:57 AM

Cyberabad Economic Offences Wing Case Registered Against Director Gudluri Ashok Babu And Producer Vijayalakshmi

రూ.3.50 కోట్లు వసూలు చేసిన దర్శక, నిర్మాతలు

సాక్షి, హైదరాబాద్‌: సినిమాలో హీరో అవకాశం ఇస్తానని నమ్మించి ఓ యువకుడిని నిలువెల్లా మోసం చేశారు. ఈమేరకు దర్శకుడు గుడ్లూరి అశోక్‌ బాబు, నిర్మాత విజయలక్ష‍్మీలపై సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఠాణాలో కేసు నమోదైంది. కూకట్‌పల్లికి చెందిన నాయుడు హనుమంతరావు కుమారుడికి సినిమాలంటే మక్కువ. దీన్ని అవకాశంగా మలుచుకున్న అశోక్, విజయలక్ష‍్మీలు సినిమా అవకాశం ఇస్తామని నమ్మించారు.

యువకుడి తల్లిదండ్రుల నుంచి పలు దఫాలుగా రూ.3.50 కోట్లు తీసుకున్నారు. అయితే అనుకోని కారణాలతో సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఇచ్చిన సొమ్ము వాపసు ఇవ్వాలంటూ బాధితులు దర్శకుడు అశోక్‌ బాబు, నిర్మాత విజయలక్ష‍్మీలను సంప్రదించారు. దీంతో వాళ్లు డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో విసుగు చెందిన బాధితుడు హనుమంతరావు సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్శకుడు అశోక్‌ బాబు తెలుగులో భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement